నమ్మకానికి జగన్ మారుపేరైతే.. వెన్నుపోటుకు చంద్రబాబు మారుపేరు – పేర్ని నాని

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మాజీమంత్రి పేర్ని నాని. నమ్మకానికి జగన్ మారుపేరైతే.. వెన్నుపోటుకు, నమ్మకద్రోహానికి చంద్రబాబు మారుపేరు అని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బందరులో జరిగిన సభలో చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. బందరుకు చంద్రబాబు నాయుడు ఏం చేశారని ప్రశ్నించారు.

2014లో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. నిన్న చంద్రబాబు నిర్వహించిన సభలో ఖాళీ కుర్చీలు తప్ప ప్రజలు లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి పచ్చి రాజకీయ మోసగాడు ఎవరూ లేరన్నారు పేర్ని నాని. నీరు – చెట్టు పథకంలో చంద్రబాబు వేల కోట్లు కొట్టేసారని ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఒక్క మంచి పని అయినా చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నించారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version