ఏపీలోని టీడీపీ సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు పార్టీ మార్పు అంశంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. వీలైతే వైసీపీలోకి లేకపోతే బీజేపీలోకి వెళ్లేందుకు అనేకమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై సీబీఐ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే బీజేపీలోకి వెళ్లేందుకు దాదాపుగా సిద్ధమైన రాయపాటి సాంబశివరావు మాత్రం.. ఎందుకో ఈ విషయంలో మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన టీడీపీని వీడతారని కూడా పుకార్లు రావడంతో తాజాగా ఈ వ్యవహారంపై రాయపాటి క్లారిటీ ఇచ్చారు. ‘సీబీఐ వచ్చినప్పుడు నేను కంపెనీలో లేను. తనిఖీలు చేసి ఏమీ లేదని సీబీఐ అధికారులు వెళ్లిపోయారు. సీబీఐ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. కంపెనీ వ్యవహారాలన్నీ సీఈవో చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి పార్టీ మారే ఆలోచన లేదు.. మున్ముందు ఉండొచ్చు’ అని రాయపాటి చెప్పుకొచ్చారు.