పరీక్ష పత్రాలు వేలం ద్వారా అమ్మకాలు జరిగాయి – రేవంత్ రెడ్డి

-

పరీక్షా పత్రాలు వేలం ద్వారా అమ్మకాలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిందితులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రశ్నించక ముందే కేటీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మంత్రులు ప్రశ్నించే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరికే ఈ లీకేజి తో సంబంధం ఉందని ఆరోపించారు.

దేనినైనా క్రెడిట్ తీసుకొనే ఈ ఇద్దరు ఇప్పుడు దీన్ని కూడా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కంప్యూటర్లన్ని ఏ శాఖకైన టీఎస్టీఎస్ నుండి వెళ్లాల్సిందేనని.. TSTS చైర్మన్ గా ఉన్న జగన్మోహన్ రావ్ కేటీఆర్ బంధువేనని ఆరోపించారు. 2017 లో చైర్మన్ అయ్యాను అని జగన్ మోహన్ రావు చెపుతున్నారని అన్నారు. రాష్ట్రం లో కంప్యూటర్ కలిగిన అన్ని సంస్థలకు TSTS నుండి వెళ్లాల్సిందేనన్న రేవంత్ రెడ్డి.. 2015 లో కంప్యూటీరికరణ చేస్తాం అని TSPSC ని కేటీఆర్ సందర్శించినప్పుడు చెప్పారని గుర్తు చేశారు.

“సెక్యూరిటీ అడిట్ తప్పనిసరిగా జరగాలి. అడిట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వము చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉన్న సంస్థ మాత్రమే అడిట్ చేయాలి. ఈ సిస్టం హ్యాక్ అవుతే అలర్ట్ వస్తుంది. చైర్మన్ , సెక్రటరీ , కాన్పిడెన్షియల్ సెక్షన్ ఆపీసర్ కు అలెర్ట్ రావలి” అంటూ మరోసారి కీలక ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version