TSPSC నిందితుల విచారణలో కీలక ఆధారాలు సేకరించిన సిట్

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సిట్ కార్యాలయంలో తొమ్మిది మంది నిందితుల విచారణ మూడవ రోజు ముగిసింది. మూడో రోజు కస్టడీ విచారణలో కీలక ఆధారాలు సేకరించింది సిట్. ప్రవీణ్, రాజేశేఖర్, రేణుక ఇచ్చిన సమాచారంతో పలువురు అనుమానితులను విచారించింది సిట్. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రవీణ్, రాజశేఖర్ ఇంట్లో సోదాలు జరిపింది.

రేణుక తోపాటు మరో ఆరుగురినీ సిసిఎస్ లో విచారించారు సిట్ అధికారులు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు సాగింది. గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్ష రాసి ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నలుగురు అనుమానితులను ఫోన్ ద్వారా విచారించింది సిట్. ఈ కేసులో ఆరోపణలు చేస్తున్న రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి తో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీ కేసులో వారి వద్ద వున్న ఆధారాలను ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు సీట్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version