ఒక్క లవ్ ఫెయిల్యూర్ తప్ప.. ఎవరితోనూ ఎఫైర్స్ లేవంటున్న అడవి శేష్ ..!!

-

అడవి శేష్.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సుమారుగా పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సరైన హిట్ కూడా ఇతని ఖాతాలో పడలేదని చెప్పవచ్చు. ఇక తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అడవిశేషు ఒక సూపర్ హిట్ విజయాన్ని కూడా అందుకోక పోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజానికి విభిన్నమైన కథాంశంతో ప్రత్యేకంగా సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు అడవి శేష్.. నిజానికి ఈయన ఎంచుకునే సినిమా కథలన్నీ థ్రిల్లర్ , సోషియో ఫాంటసీ నేపథ్యంలో కొనసాగుతూ ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదు.ఇకపోతే అడవిశేష్ తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింతగా అలరించాడు అని చెప్పవచ్చు. ఇక అంతే కాదు మేజర్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు అడవి శేష్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులకు నేను రెండవ కొడుకుని అని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ ను పురస్కరించుకొని అడవి శేషు ఆర్కే షోకి హాజరవడం జరిగింది. ఈ షోలో భాగంగా తన వ్యక్తిగత విషయాలను కూడా ఆయన వెల్లడించారు.

ఇక ఎవరినైనా ప్రేమించావా అనే ప్రశ్న ఎదురవగా.. అవును నిజమే ప్రేమించానని తెలిపాడు.. ఆ అమ్మాయి ఎవరు అనే విషయాన్ని బయట పెట్టకుండా అమెరికాలో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించాను అని, అయితే ఆ అమ్మాయి నా పుట్టిన రోజు నాడే ఇంకొక అతన్ని వివాహం చేసుకుని దుఃఖాన్ని మిగిలించింది అని తెలిపాడు. ఇక ఆ రోజు నుంచి ఏ ఒక్క అమ్మాయితో లవ్ ఎఫైర్ నడపలేదు అని స్పష్టం చేశాడు. మొత్తానికి అయితే అడవిశేష్ సింగిల్ అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version