టాక్స్ నుండి రాబడిని వసూలు చేయాలనే లక్ష్యాన్ని దెబ్బ తీయకుండా ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై లీటర్ కి 8.5 రూపాయల వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు తెలిపారు. గత తొమ్మిది నెలల నుంచి చూసుకుంటే పెట్రోల్ రేట్లు మరియు డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అపోజిషన్ పార్టీలు మరియు సొసైటీ కూడా ప్రభుత్వాన్ని ఎక్సైజ్ డ్యూటీ తగ్గించమని కొనుగోలుదారుల కి కాస్త ఇబ్బంది పడకుండా ఉండేలా చూడమని కోరింది.
ఇది ఇలా ఉండగా మార్చి 2020 నుంచి 2020 మే మధ్య పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ .13 మరియు రూ .16 పెంచింది, ఇప్పుడు డీజిల్‌పై రూ. 31.8, పెట్రోల్‌కు రూ.32.9 గా ఉంది. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధర లో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉన్నాయని పిటిఐ నివేదించింది.
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ 91.1 7 గా ఉంది మరియు డీజిల్ ధర 81.47 గా ఉంది. ఇలా రేట్లు భగ్గుమంటున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ లో వందకు గత నెల లోనే చేరిపోయాయి. నవంబర్ 2014 నుంచి జనవరి 2016 మధ్య ధరలు చూసినట్లయితే ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్, డీజిల్ పై పెంచింది. ఏది ఏమైనా ఇది సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.
మొత్తంమీద, పెట్రోల్ రేటుపై సుంకం గత 15 నెలల్లో లీటరు పెట్రోల్ కి 11.77 రూపాయలు, డీజిల్‌పై 13.47 లీటరు పెంచింది. ఇది ప్రభుత్వ ఎక్సైజ్ మాప్-అప్‌కు 2016-17లో రెట్టింపు. రూ .2,42,000 కోట్లకు పెరిగింది. 2014-15లో 99,000 కోట్లు.