మెగా హీరోతో జోడి కట్ట బోతున్న పూజ హెగ్డే …!?

-

రాజకీయాల కోసం తీసుకున్న గ్యాప్‌ను వరుస సినిమాలతో భర్తీ చేయాలని చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగానే రీఎంట్రీ తర్వాత ఆయన వేగంగా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్.. ప్రస్తుతం టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది.

వరుస సక్సెస్ లతో సినిమాసినిమాకు మార్కెట్ రేంజ్ పెంచుకుంటున్న కొరటాల శివ సినిమాలో చిరంజీవి, చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. కరోనా, లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇకపోతే సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తుండగా రామ్ చరణ్ హీరోయిన్ విషయంలో చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట్లో రష్మిక, కియారా అద్వానీ పేర్లు వినిపించగా…ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమా విజయంతో కథానాయిక పూజ హెగ్డే రేంజ్ మరింతగా పెరిగిపోయింది. పారితోషికం పెంచినా కూడా నువ్వే కావాలంటూ దర్శక నిర్మాతలు ఆమె డేట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ సరసన కూడా నటించనున్నట్టు తెలుస్తోంది..దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండే చరణ్ క్యారెక్టర్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇందులో చెర్రీ నక్సలైట్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ఈ చిత్రంలో అతడికి జోడీగా హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు..పూజా హెగ్డే కూడా చరణ్ కు జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.అతిత్వరలో చిత్రయూనిట్ నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలావుంచితే, పూజ హెగ్డే ఇటు తెలుగులో నటిస్తూనే.. అటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం అక్కడ కభీ ఈద్ కభీ దివాలి, సర్కస్ చిత్రాలలో నటిస్తోంది. మరికొన్ని ప్రాజక్టులు కూడా ప్రస్తుతం చర్చల దశలో వున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version