తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలనే ఆశ మంచిది కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ మధ్యకాలంలో విద్యార్థులు, ఉద్యోగులు అధికంగా బెట్టింగ్ యాపుల బారిన పడి ప్రాణాలు తీయడంతో పాటు తమ ప్రాణాలనూ తీసుకుంటున్నారని హరీశ్ రావు గుర్తుచేశారు.
బెట్టింగ్ యాప్స్ బారిన పడి అప్పులు తీర్చలేక కొందరు కుటుంబ సభ్యులను(భార్యా, పిల్లలను) చంపేసి తమ ప్రాణాలనూ తీసుకుంటున్నారని.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న ఆశ మంచిది కాదని ఈ సందర్భంగా హరీశ్ రావు సూచించారు. శ్రీ రాముడిని ఆదర్శంగా తీసుకుని అందరూ ఆయన మార్గంలో నడవాలని హితవు పలికారు.