ప్రజాప్రభుత్వం ముసుగులో రేవంత్ అరాచక పాలన : ఏనుగుల రాకేశ్ రెడ్డి

-

ప్రజాప్రభుత్వం ముసుగులో సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వ, అరాచక పాలన కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ఫలితాలు తాజాగా వెలువడగా.. అందులో అవకతవకలు జరిగాయని.. అభ్యర్థుల తరపున అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నదని రాకేశ్ రెడ్డి విమర్శించారు.

rakesh reddy
rakesh reddy

ఇలాంటి పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొంటామని.. విద్యార్థుల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మీ అక్రమాలను బయట పెడుతూనే ఉంటామని ఆదివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news