వనజీవి రామయ్య అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని సందర్శకుల కోసం ఉంచగా.. ఆదివారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆయన భౌతికకాయానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వనజీవి రామయ్య మృతి చాలా దురదృష్టకరం, బాధాకరం అని పేర్కొన్నారు.
ఆయన జీవించినంత కాలం ఏం సాధించుకున్నారనేది ఆలోచన చేయాలని.. రామయ్య చెట్లను పెంచే కార్యక్రమంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా కోటి మొక్కలు పైగా నాటారని గుర్తుచేశారు.మొక్కలు ఎలా పెంచాలి అని, మొక్కలతో వచ్చే లాభాలు ప్రజలకు వివరిస్తూ అనేక ప్రాంతాల్లో ప్లాంటేషన్ చేపట్టారన్నారు.వనజీవి రామయ్యకు చిరకాల కోరికలు ఉన్నాయని, కుటుంబ సభ్యులు వాటి గురించి వివరించారని, వాటిని నెరవేరుస్తామని అన్నారు.