హైదరాబాద్ మహానగరంలో అపరిశుభ్రమైన ఆహారంతో పాటు కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్‌ను కొందరు వ్యాపారస్తులు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు హోటల్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కల్తీ ఆహారం, చెడిపోయిన ఫుడ్ పదార్థాలను పట్టుకుని హోటళ్లను సీజ్ చేయడంతో పాటు వారికి భారీ జరిమానాలు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఉప్పల్‌లోని ఏవీడీ కంపెనీలో కాలం చెల్లిన కారా మిక్సర్ ప్యాకింగ్, అపరిశుభ్రత గల ఆహార పదార్థాలు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏవీడీ కంపెనీకి భారీ జరిమానా విధించినట్లు సమాచారం. ఇకపై ఎవరైనా కాలం చెల్లినా, శుభ్రత లేని ఫుడ్ పదార్థాలను అమ్మినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.