మరికొన్ని రోజుల్లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేడీ నడ్డా పదవీకాలన్ని పొడిగించింది.
ఈ సంవత్సరం జూన్ వరకు పొగిడించాలని పార్లమెంటరీ బోర్డు ఆదివారం ఆమోదం తెలిపింది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ఈ టైంలో అధ్యక్షుడి మార్పు సరికాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది .
కాగా, 2019 జూన్ 19 నుండి 2020 జనవరి 20 వరకు జేపీ నడ్డా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2020 జనవరి 20 నుండి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు.. దాంతో పాటు ఆరోగ్య, కేంద్ర కేబినెట్‌లో కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల ఆయన పదవీకాలాన్ని పొడిగించాలనే ప్రతిపాదన అమిత్‌షా చేయగా, దీనికి బీజేపీ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం జేపీ నడ్డాకు ఉంటుంది.