విజయ్ పార్టీ పేరులో మార్పు.. కారణం ఏంటంటే?

-

ఎప్పుడెప్పుడా అని ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ పొలిటికల్ అరంగేట్రంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు దళపతి విజయ్ శుభ వార్త చెప్పిన విషయం తెలిసిందే.ఇక ఈ పార్టీకి “తమిళ వెట్రి కళగం” అనే పేరు ఖరారు చేశారు హీరో విజయ్ .2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా…. తమిళగ వెట్రి కళగం పార్టీ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. తమిళగ వెట్రి కళగం పార్టీ పేరులో స్వల్ప మార్పు చేస్తున్నారట.ఈ పేరులో అదనంగా ‘క్‌’ అనే అక్షరాన్ని చేర్చారు. ఎందుకంటే తమిళగ వెట్రి కళగం పార్టీని ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. దీనిపై తమిళనాడులోని కొన్ని పార్టీల నుండి వ్యతిరేకత వస్తోంది.తమిళగ వాల్వురిమై కట్చి అనే పేరుతో తమిళనాడులో ఒక పార్టీ ఉంది. ఆ పార్టీని కూడా ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. ఇక విజయ్‌ పార్టీని కూడా ఇదే పేరుతో పిలుస్తుండటంతో ఇబ్బంది కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.దీంతో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం పేరులో ‘క్‌’ అనే అక్షరాన్ని కలపాలని నిర్ణయించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news