ట్యాంక్ బండ్ పైకి ప్రతి ఆదివారాల్లో వాహనాలకు వాహనాలకు నో ఎంట్రీ విధానం అమలు చేస్తున్నారు. దీనిని ఇప్పటికే వరకు సాయంత్రం 5 గంటల నుంచి రాతం్రి 10 గంటల మధ్య కేవలం సందర్శకులకే కేటాయించారు. అయితే… తాజాగా ఈ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన నుంచి ఆదేశాలు అందుకున్న క్షేత్ర స్థాయి అధికారులు.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ విధానం.. అమలుకు కసరత్తు చేస్తున్నారు.
ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 26 వ తేదీ నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు పోలీసులు. కాగా… గత నెల 24 వ తేదీన అశోక్ చంద్ర శేఖర్ అనే నెటిజన్ చేసిన.. ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆదివారాల్లో ట్యాంక్ బండ్ ను సందర్శకులకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు విభాగాన్ని సూచించారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న ట్రాఫిక్, శాంతి భద్రతల విభాగం అధికారులు గత నెల 29 వ తేదీ నుంచి దీనిని అమలులోకి తీసుకువచ్చారు. ఇక తాజాగా ఆ ఆంక్షలు మరింత గా పెంచారు పోలీసులు.