పాల వ్యాపారిపై ఓ వ్యక్తి మటన్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో పాల వ్యాపారం చేసే జయపాల్‌పై మొబిన్ అనే వ్యక్తి మటన్ కోసే కత్తితో దాడి చేశాడు.
ఎందుకంటే జయపాల్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు మొబిన్ అనుమానం పెంచుకున్నాడు.ఈ క్రమంలో జయపాల్ పాలు పోసి వస్తుండగా ఒక్కసారిగా కత్తిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందస్తుండగా.. ఈ మేరకు స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొబిన్ కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.