జమ్ముకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రదాడిని ఖండించిన ఆయన ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఉగ్రవాదులను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వదలరు అని అన్నారు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం అంతా ప్రశాంతంగా ఉందని,కాశ్మీర్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు.ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.ఉగ్రవాదులను పట్టుకునే వరకు మోడీ, అమిత్ షా ఈ విషయాన్ని అసలు వదలరు అని రాజాసింగ్ అన్నారు. కాగా, మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటివరకు 28 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.