మోహన్ బాబు కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. భారీగా చేరుకున్న పోలీసులు

-

మంచు ఫ్యామిలీలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ నుంచి మంచు మనోజ్ కాసేపటి కిందటే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.అక్కడి నుంచి ర్యాలీగా రంగంపేటలోని మోహన్ బాబు కాలేజీ వద్దకు వెళ్తున్నట్లు తెలిసింది.

కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో కాలేజీ గేట్లను సిబ్బంది పూర్తిగా మూసివేశారు. కాలేజీ వద్దకు ఎవరినీ అనుమతించొద్దని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు రావడంతో మీడియాను కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది వెల్లడించారు. మనోజ్ రాక గురించి ముందే తెలుసుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కాలేజీ వద్ద ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news