నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌లో తీవ్ర ఉద్రిక్తత..సెక్యూరిటీ అధికారిపై దాడి

-

నిజామాబాద్ మార్కెట్ యార్డులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అదే యార్డులో పనిచేస్తున్న సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికుల దాడకి పాల్పడ్డారు. కాంటాల కోసం తీసుకొచ్చిన పసుపు దొంగతనానికి గురవ్వడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పసుపు దొంగతనం ఆరోపణలను నిరసిస్తూ పసుపు కాంటాలను నిలిపివేసి మరీ కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మార్కెట్ యార్డుకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌ను పోలీస్ వాహనంలో ఎక్కించారు. అతన్ని తీసుకెళ్తుండగా కొందరు కార్మికులు పోలీస్ వాహనం డోర్ ఓపెన్ చేసి శ్రీనివాస్ మీద దాడికి యత్నించారు. అనంతరం వారిని పోలీసులు కంట్రోల్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news