కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మద్యం ధరలను పెంచిన విషయం తెలిసిందే. ధరల పెంపుపై మద్యం ప్రియులు ఇప్పటికే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. బీర్ల సరఫరా దారలకు కమిషన్ పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేయడంతో రేవంత్ సర్కార్ 15 శాతం ధరలను పెంచింది.’
దీంతో కింగ్ ఫిషర్ లైట్ బీర్ల ధరలు రూ.150 నుంచి 172 వరకు పెరిగాయి. కంపెనీలు, లైట్, స్ట్రాంగ్ బీర్లను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి.అయితే, ప్రభుత్వం మద్యం సరఫరా దారుల కోసం ధరలు పెంచింది కానీ, క్వాలిటీ విషయాన్ని చెక్ చేయొద్దా? అని మందు ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జనగామ జిల్లా దేవరుప్పులలో కింగ్ ఫిషర్ బీరు తీసుకున్న వ్యక్తి అందులో ఫంగస్‌ను గుర్తించాడు. ధరలు పెంచి, కల్తీ బీర్లు సరఫరా చేస్తున్నారని మద్యం ప్రియుల ఆందోళన చేపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
జనగామ జిల్లా దేవరుప్పులలో ఫంగస్ పట్టిన బీరు సరఫరా
ధరలు పెంచి, కల్తీ బీర్లు సరఫరా చేస్తున్నారని మద్యం ప్రియుల ఆందోళన pic.twitter.com/yJI7FGltp3
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2025