ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త.. ఫేస్‌ రికగ్నిషన్‌లో మినహాయింపు

-

దృష్టిలోపం ఉన్న(విజువల్లీ ఇంపైర్డ్‌) ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు ప్రక్రియ నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ముఖ ఆధారితహాజరు వేయడానికి తగిన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. అయితే.. సచివాలయం, హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వరకు ఉద్యోగులందరికి ఈ నిబంధన వర్తిస్తుంది. అన్ని కేడర్ల ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు తప్పనిసరి చేశారు. జనవరి 21 నుంచి సచివాలయం, అన్ని శాఖల హెచ్‌వోడీలు, జిల్లా అధికారులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు అమలు చేస్తున్నారు. ఇతర అన్ని కేడర్ల ఉద్యోగులకు జనవరి 16 నుంచి అమలు చేస్తున్నారు.

ఈ మేరకు ఫేస్ రికగ్నిషన్ హాజరు అమలులోకి తెస్తూ సీఎస్ జవహర్ రెడ్డి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో సచివాలయం నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు.. అలాగే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుకు ఫేషియల్‌ రికగ్నేషన్‌ హాజరు విధానం అమలు చేస్తున్నారు. ఫేషియల్‌ రికగ్నేషన్‌ హాజరుపై అప్పట్లో అభ్యంతరాలు వచ్చాయి. యాప్ సరిగా పనిచేయడం లేదని.. కొన్ని లోటుపాట్లు ఉన్నాయన్నారు. తర్వాత వాటిని ప్రభుత్వం సరిచేసింది.. ఇప్పుడు తాజాగా అందరికీ ఒకే విధానాన్ని అమలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version