ఏ క్షణమైన తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని..అభ్యర్థులకు ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లేందుకే సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. గాంధీభవనల్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. దీంతో, వారి మధ్య చర్చపై ఆసక్తి నెలకొంది.
అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. తాను కాంగ్రెస్ జెండాతోనే పని చేశానని.. గాంధీభవన్‌తో 30 ఏళ్లుగా తనకు అనుబంధం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ను ఎలా అధికారంలోకి తీసుకురావాలనేది పార్టీ మీటింగ్‌లో చెప్తానని వెల్లడించారు. తనలాంటి సీనియర్లు పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించానని అన్నారు. జనవరి 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాను. అధికారంలోకి ఎలా రావాలి? అనే అంశంపై చర్చిస్తాము. అవసరమైతే తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేస్తాను అని అన్నారు.