మరో రెండు రోజుల్లో ట్విటర్, ఫేస్బుక్ బ్లాక్ అయిపోతాయా…?

-

మరో రెండు రోజుల్లో ట్విటర్, ఫేస్బుక్ కూడా బ్లాక్ అయిపోతాయి అన్న వార్తలు వింటున్నాం. అసలు దీనికి గల కారణాలు ఏమిటి..? ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనలపై ట్విట్టర్, ఫేస్ బుక్ యజమాన్యాలు ఇప్పటికే స్పందించలేదు. మే 26 తో ఈ గడువు పూర్తవుతుంది.

దీనితో ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించక పోవచ్చని వార్తలు వినబడుతున్నాయి. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫిబ్రవరి 26న ఓటీటీ మాధ్యమాల్లో మూడో అంచె వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని అన్నారు.

ఓటి డిజిటల్ న్యూస్ మాధ్యమాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి వెల్లడించాలి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆ రోజు అన్నారు. అయితే దీనిపై ఈ సంస్థలు స్పందించలేదు ఒక సంస్థ మాత్రం వీటికి అంగీకరించింది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నూతన నిబంధన కోసం చూస్తే..

ఏదైనా దర్యాప్తు లేదా సైబర్ సంబంధిత ఘటనపై అడిగిన 72 గంటల్లోగా ఆయా సంస్థల సహకారం చేయాలి.
జాతి, మత పరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించేందుకు కంపెనీ తప్పనిసరిగా అధికారిని నియమించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిర్యాదుల పరిష్కారానికి మరో అధికారిని తప్పనిసరిగా నియమించాలి. ఈ అధికారులు తప్పని సరిగా భారతీయులై ఉండాలి అని కూడా చెప్పింది.
లైంగిక చర్యలకు సంబంధించి సమాచారం పై ఫిర్యాదు అందిన రోజునే తప్పనిసరిగా స్పందించాలి.

Read more RELATED
Recommended to you

Latest news