కారుని ముంచనున్న జంపింగ్‌లు..!

-

రాజకీయాల్లో జంపింగ్‌లు అనేవి సహజంగానే జరిగే ప్రక్రియ…ఈ జంపింగ్‌ల వల్ల ప్రత్యర్ధులు వీక్ అవుతారని చెప్పొచ్చు..అందుకే ఎప్పుడు అధికారంలో ఉండే పార్టీలు ప్రత్యర్ధి పార్టీలని దెబ్బకొట్టాలని చెప్పి..ఆ పార్టీలకు చెందిన నేతలని లాగేసుకుంటారు. అలా లాగేయడం వల్ల ప్రత్యర్ధి పార్టీలు మరింత వీక్ అవుతాయి. తెలంగాణలో రెండుసార్లు అధికార పీఠంలో కూర్చున్న కేసీఆర్ అదే పని చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే…మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీని పూర్తిగా దెబ్బకొట్టేశారు..కాంగ్రెస్‌ని కాస్త వీక్ చేశారు.

TRS-Party | టీఆర్ఎస్

రెండోసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ని పూర్తిగా దెబ్బకొట్టాలనే కోణంలో ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలని లాగేసుకున్నారు..ఇక చివరికి టీడీపీకి ఉన్న 2 ఎమ్మెల్యేలని సైతం లాగేశారు…ఈ దెబ్బతో టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. కాంగ్రెస్ కూడా వీక్ అయిపోయింది. అయితే ప్రత్యర్ధులని వీక్ చేయడం బాగానే ఉంది గాని..ఈ జంపింగ్‌ల వల్ల టీఆర్ఎస్‌కు నష్టం జరుగుతుందనే అంశం కేసీఆర్ అంచనా వేసినట్లు లేరు…అందుకే ఊహించని విధంగా ఇప్పుడు టీఆర్ఎస్‌కు జంపింగ్‌లే పెద్ద తలనొప్పిగా తయారయ్యారు.

ఇప్పుడు జంపింగ్‌లు ఉన్న స్థానాల్లో పెద్దా రచ్చే నడుస్తోంది. జంపింగ్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది..సీట్లు కోసం నేతల మధ్య వార్ నడుస్తోంది…అయితే చివరికి ఎవరొకరికి సీటు ఇవ్వడం అనేది ఖాయమే…కానీ ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి ఉండదు…పరోక్షంగా ఓడించడానికి ప్రయత్నిస్తారు..దీని వల్ల టీఆర్ఎస్‌కు భారీ నష్టమే జరిగేలా ఉంది.

ఇప్పటికే కాంగ్రెస్ జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్న 12 స్థానాల్లో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది..టీఆర్ఎస్ నేతలు, జంపింగ్ నేతల మధ్య వార్ గట్టిగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలసిన బాధ్యత కేసీఆర్‌దే…ఒకవేళ ఈ పోరుకు బ్రేక్ పడకపోతే కారు మునిగిపోవడం ఖాయం…ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పోటీలో 12 సీట్లు అంటే మాటలు కాదు…కాబట్టి టీఆర్ఎస్ చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాసిన అవసరం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version