వైఎస్ వివేకా హత్య కేసులో చాలా అనుమానాలు ఉన్నాయని.. సునీత వాగ్మూలం ప్రకారం ఈ హత్య కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డే ఏ-1 అని మాజీ మంత్రి బండారు సత్య నారాయణ మూర్తి అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ముఖ్య మంత్రి జగన్ పాత్రపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ పై ప్రమాణం చేసి జగన్.. ముఖ్య మంత్రి హోదాలో ఉన్నారని అన్నారు. అలాంటి వ్యక్తి ఒక హత్య కేసుకు సంబంధించి నిజాన్ని ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.
వివేకా హత్య గురించి ముందే తెలిసి కూడా అప్రమత్తం చేయకపోవడం దారుణం అని అన్నారు. ఇది సీఎం ఉద్ధేశ పూర్వకంగానే చేసినట్టు అనిపిస్తుందని అన్నారు. వివేకా హత్య కేసు వ్యవహారంలో సీఎం జగన్ పై గవర్నర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ కల్పించుకోవాలని అన్నారు. అలాగే వివేకా హత్య కేసులో సీఎం జగన్ ను సీబీఐ చేత విచారించాలని డిమాండ్ చేశారు. సీఎంను సీబీఐ చేత విచారిస్తే.. నిజాలు బయట పడే అవకాశం ఉందని అన్నారు. అలాగే ఈ కేసులో సీబీఐ విచారణ కోరిన సీఎం.. మళ్లీ ఎందుకు తన లేఖను ఉప సంహరించుకున్నారని ప్రశ్నించారు.