వచ్చే ఎన్నికల్లో వైఎస్ సునీత టిడిపి నుంచి పోటీ చేస్తుందేమో : సజ్జల

-

వివేకానంద రెడ్డి హత్య కేసు పై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా కూతురు సునీత.. ఎవరి మాటలు విని ఇలా మాట్లాడుతుందొనని… ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు మాటలు విని సొంత కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ సునీత పై… అసంతృప్తి వ్యక్తం చేశారు సజ్జల. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆమె పోటీ చేస్తుందేమో అంటూ చురకలంటించారు.ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని శక్తులు పని చేస్తున్నాయని.. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర అని ఫైర్ అయ్యారు.

ఈ కుట్ర ఇప్పుడు పరాకాష్టకు చేరిందని.. పూర్తిగా రాజకీయపరమైన కుట్రను ఒక ముఠా చేస్తోందని మండిపడ్డారు. మా కుటుంబంలోని ఒక నాయకుడి వ్యక్తిగత జీవితం బయటకు రాకూడదనే మేము ఇంత వరకు నిగ్రహం పాటించామని.. కానీ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి మాట్లాడిన తర్వాత మేమూ మౌనం వీడక తప్పటం లేదన్నారు.

చంద్రబాబు జగన్నాటకం ఆడిస్తున్నాడని.. వీళ్ళందరూ అందులో పావులో, సహ పాత్రధారులో తెలియదని చెప్పారు. 161 లో నేరానికి సంబంధించిన విషయాలు ఉంటాయా లేక రాజకీయ వ్యాఖ్యలు ఉంటాయా?? కోడి కత్తి అనే పదజాలం ఎవరు వాడతారో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. ఎర్ర గంగిరెడ్డి రక్తపు మరకలు తుడిపించాడని అందరికీ తెలుసని.. వివేకానంద రెడ్డి కి అతను అత్యంత సన్నిహితుడు అని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version