ఫ్యాక్ట్ చెక్: మొసళ్ళు వెళ్తున్నది బెంగుళూరులోనేనా..? వచ్చిన వార్త నిజమేనా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఈ మధ్య బెంగళూరులో వర్షాలు గట్టిగా కురుస్తాయి నీళ్లు కూడా చాలా చోట్ల రోడ్లపై నిలిచిపోయాయి. అయితే ఆ నీటిలో మొసళ్ళు తిరుగుతున్నాయని వర్షాల వల్ల మొసళ్ళు రోడ్ల మీద ఉన్నాయని వార్త వచ్చింది. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీళ్లు నిలిచిపోవడం మొసళ్ళు అందులో నడవడం కనపడుతోంది.

అదే విధంగా ప్రజలు వాటిని పై నుండి చూస్తున్నారు. అయితే ఇది నిజంగా నిజమేనా లేదంటే ఇది ఫేక్ వార్త అనేది ఇప్పుడు చూద్దాం. అంతే కానీ ఇది బెంగళూరులో జరిగినది కాదు. శివపూర్ మధ్య ప్రదేశ్ లోనిది. బెంగళూరులో నీళ్లు నిలిచిపోయిన సంగతి నిజమే కాని అందులో మొసళ్ళు ఉండడం అనేది అబద్ధం. వచ్చిన వీడియోలో నిజం లేదు ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version