ఈ మధ్య కాలం లో నకిలీ వార్తలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. నిజానికి నకిలీ వార్తల్ని నమ్మారు అంటే అనవసరంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలం లో జాబ్ నోటిఫికేషన్స్, స్కీమ్స్ మొదలైన ఫేక్ వార్తలను మనం చూస్తున్నాం.
తాజాగా మరో ఒక వార్త వచ్చింది. అయితే అందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే… పునరుత్పాదక ఇంధన రంగంలో భారత ప్రభుత్వం తో ‘గోల్డ్‌కోట్ సోలార్’ సహకరిస్తోందని విద్యుత్ మంత్రిత్వ శాఖ పేరుతో విడుదల చేసిన లేఖ లో వుంది. అయితే మరి ఇది నిజమా లేదు అంటే నకిలీ వార్తా అనేది చూద్దాం.
నిజానికి ఈ లేఖలో వున్నది అంతా నకిలీ వార్తే. ఈ లేఖ కూడా నకిలీదే. ఈ లేఖ లో ఏ మాత్రం నిజం లేదు అని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి నకిలీ వార్తలను అస్సలు నమ్మద్దు. అలానే ఇలాంటి వాటిని ఎవరికీ షేర్ కూడా చెయ్యద్దు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని మీద స్పందించింది. ఈ లేఖ లో ఏమి నిజం లేదని.. ఈ లేఖ కూడా ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ లో షేర్ చేసింది.