ఫ్యాక్ట్ చెక్: క్యాబేజీ ద్వారా కొవిడ్ వ్యాప్తి చెందుతుందా?

-

ఈ సెకండ్‌వేవ్ క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అంద‌రిలో ఎన్నో అనుమానాలు త‌లెత్తుతున్నాయి.  క్యాబేజీ వ‌ల్ల క‌రోనా అంటూ ఓ పోస్ట్ వైర‌ల్ అయింది. ఇప్ప‌టికే వ‌స్తువులు, ఇత‌ర సామాన్ల ద్వారా కొవిడ్ వ్యాపిస్తుంద‌ని అనేక పుకార్లు షికారు చేశాయి. క్యాబేజీ ద్వారా కొవిడ్ వ్యాపించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై శాస్త్ర‌వేత్త‌లు క్లారిటీ ఇస్తున్నారు.

యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా ఈ విధ‌మైన అనుమానాల‌పై క్లారిటీ ఇచ్చింది. తన వెబ్‌సైట్‌లో ఆహారానికి సంబంధించిన వాటి ద్వారా కొవిడ్ -19 సోకే అవ‌కాశం లేద‌ని తెలిపింది. పీఐబి ఫ్యాక్ట్ చెక్ సంస్థ ఈ వార్త‌పై స్పందించి.. క్యాబేజీ వ‌ల్ల క‌రోనా అంటూ వైర‌ల్ అవుతున్న పోస్ట్ అబ‌ద్ధమ‌ని తేల్చి చెప్పింది.

క్యాబేజీలో వైరస్ చాలా కాలం బ‌తికే ఉంటుంద‌ని, చెప్పే తప్పుడు WHO నివేదికను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కొంద‌రు. దీంతో ఇది నిజ‌మే అని చాలామంది న‌మ్ముతున్నారు. క్యాబేజీని తినవద్దంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే WHO ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాటి నివేదిక‌లు ఇవ్వ‌లేద‌ని, ఇదంతా అబ్ధ‌మ‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి ప్రతినిధి స్ప‌ష్టం చేశారు. క్యాబేజీ ద్వారా ఎలాంటి వైర‌స్‌లు వ్యాప్తి చెంద‌వ‌ని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version