ఫ్యాక్ట్ చెక్: హిందీ మీడియా RRR సినిమా మీద నెగటివిటీని స్ప్రెడ్ చేస్తోందా..? నిజమెంత..?

-

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమాలో హీరోలుగా నటించనున్నారు. అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా మీద అందరికీ ఆశలు ఎక్కువగానే ఉన్నాయి.

 

అయితే తాజాగా హిందీ మీడియా ఆర్ఆర్ఆర్ సినిమా పై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తోందని వార్తలు వచ్చాయి. అయితే నిజంగా హిందీ మీడియా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తోందా..? ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా హిందీ మీడియా ఎస్ ఎస్ రాజమౌళి ని లెజెండ్రీ దర్శకుడు అని చెప్పింది.

బాహుబలి తర్వాత నుండి రాజమౌళి పేరు మారు మ్రోగిపోతోంది. రాజమౌళి దర్శకత్వం కి తెలుగు మీడియా మాత్రమే కాకుండా మొత్తం అన్ని చోట్లా ఫిదా అయిపోయారు. పైగా బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా RRR సినిమా ప్రమోషన్స్ కి వెళ్లారు.

కానీ నిజానికి తెలుగు ప్రేక్షకులు ఇలాంటివి నమ్మడం, చెప్పడం సరైనది కాదు. నిజానికి సినిమా నచ్చితే ఆడియన్స్ చూస్తారు నచ్చకపోతే ఆడియన్స్ చూడరు. కానీ హిందీ మీడియా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తోంది అనేది మాత్రం వాస్తవం కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version