పెగాసెస్ పై హౌస్ కమిటీ వేసుకో.. జూడిషియరీ కమిటీ వేసుకో.. సీబీఐ విచారణ దేనికైనా సిద్దమని.. బాబాయ్ హత్య విషయంలోనూ.. మద్యం మరణాల విషయంలోనూ విచారణ వేయగలరా..? అని నారా లోకేష్ సవాల్ విసిరారు. మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా..? లేదా..? అనే క్లారిటీ ఇప్పటికీ లేదని.. బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసెస్ ప్రస్తావన కూడా లేదని బెంగాలీ తెలిసిన నా స్నేహితుడు చెప్పాడని ఫైర్ అయ్యారు.
వ్యక్తిగత విషయాలు వినే అలవాటు మాకెవరికీ లేదు.. అంబటికి ఉందేమో.. అందుకే ఆయన రాసలీలలు బయట పడ్డాయన్నారు. ఐదు రోజులుగా మద్యం.. కల్తీ సారా మరణాలపై పోరాడుతున్నామని.. సారా మరణాలను సహజ మరణాలుగా సీఎం తీసిపారేయడం బాధాకరమని పేర్కొన్నారు.
ప.గో జిల్లాలో కల్తీ సారా వల్ల మొత్తంగా 42 మంది చనిపోయారని.. ఏపీ ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లు అన్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సప్షన్ అని వెల్లడించారు. కల్తీ సారాతో.. కల్తీ మద్యంతో పేదలను ఈ ప్రభుత్వం చంపేస్తోంది… జగన్ మోహన్ రెడ్డి కాదు.. జగన్ మోసపు రెడ్డి అని పిలిచేది ఇందుకే అంటూ చురకలు అంటించారు. . ప్రజల ప్రాణాలకంటే మరేదైనా పెద్ద సమస్య ఉందా..? మమతా బెనర్జీ స్టేట్మెంట్ ఇచ్చారంటూ పెగాసెస్ సాఫ్ట్ వేర్ పై సభలో చర్చకు పెట్టారని అగ్రహించారు.