ఫ్యాక్ట్ చెక్: సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని బీఎస్ఎన్ఎల్ నుండి వచ్చిన మెసేజ్ నిజమేనా..?

-

నకిలీ వార్తల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలం లో సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. ఇప్పుడు సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని… బీఎస్ఎన్ఎల్ నుండి ఓ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఆ వార్త వైరల్ గా మారింది. మరి అది నిజమా కాదా అనేది చూద్దాం. బీఎస్ఎన్ఎల్ నుండి కస్టమర్లకు కెవైసి సస్పెండ్ అయ్యిందని.. 24 గంటల్లో సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని అందులో ఉంది.

మరి నమ్మచ్చా లేదా అనేది చూస్తే.. బీఎస్ఎన్ఎల్ నుండి కస్టమర్లకు కెవైసి సస్పెండ్ అయ్యిందని.. 24 గంటల్లో సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని వస్తున్న వార్త నకిలీది. ఇది నిజం కాదు. కనుక ఇలాంటి వార్తలకి దూరంగా ఉండండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని మీద స్పందించింది. 24 గంటల్లో సిమ్ కార్డు బ్లాక్ అవుతుందని వస్తున్న వార్త నకిలీది అని చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version