ఫ్యాక్ట్ చెక్: ఐటీ శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ నిజంగా ఇలా అన్నారా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు.

 

పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది. సవరించిన ఐటి నిబంధనల ప్రకారం పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసే వ్యక్తులను ఆయన ప్రాసిక్యూట్ చేస్తామని అన్నారని ఓ వార్త వచ్చింది. అయితే మరి ఇది నిజమా కదా..?

ఈ వార్త లో నిజం ఎంత అనేది చూస్తే.. కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. ఇది వట్టి ఫేక్ వార్త అని తెలుస్తోంది. కనుక అనవసరంగా ఇలాంటి వార్తలను నమ్మకండి. ఇతరులకి పంపకండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version