తనని మోసగాడు అని ప్రచారం చేస్తున్న బ్యాచ్ కు గట్టి పంచ్ ఇచ్చిన పూరి.!

-

లైగర్ సినిమా ఫ్లాప్ తో డిస్ట్రిబ్యూటర్లు అందరూ వత్తిడి తెచ్చే సరికి పూరి జగన్నాథ్ వారిపై కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీనితో ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా మమ్ముల్ని మోసం చేసి, మళ్లీ తమపై బెదిరింపు కేసు పెట్టడంతో ఫైనాన్షియర్లు అందరు కలిసి  ఇకపై పూరీ సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదు అని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి.అలాగే  పూరీ తీసే సినిమాలను డిస్టిబ్యూట్ కూడా చేయకూడదని ఇతడిని బాయ్ కాట్ చేయాలనే వార్తలు వచ్చిన నేపథ్యంలో పూరి జగన్నాథ్ మరోసారి ఒక లెటర్ ద్వారా తన లోని ఆవేశాన్ని వెళ్లగక్కాడు. అందులో చివరి పేరా మాత్రం తనని ఉద్దేశించి మాట్లాడిన వారికి కౌంటర్ లా వుంది.

ఆ లెటర్ లోని చివరి పేర లో..నేను నిజాయితీ పరుడుని అని చెప్పుకొనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. ఎవరి నుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పొతే మనలన్ని పీకే వాళ్ళు ఎవరూ ఉండరు.

నేను ఎప్పుడైనా మోసం చేస్తే, అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ ని తప్ప నేను ఎవరినీ మోసం చేయలేదు.మళ్ళీ  నేను ఇంకో సినిమా తీస్తా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడ నుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే .. మధ్యలో జరిగేది అంతా డ్రామా” అంటూ పూరి వారికి గాట్టిగా పంచ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version