ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ గురించి ప్రపంచం ఎలా చర్చించుకుంటుందో అందరికీ తెలిసిందే. ఇక్కడ తాలిబన్లు సృష్టిస్తున్న అరాచకాలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రెండు దశాబ్ధాల తర్వాత అమెరికా-నాటో దళాలు అఫ్గన్ నేలను విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా సైన్యం తమ ప్రాంతాన్ని విడిచి వెళ్లాడాన్ని తాలిబన్లు పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రపంచ మీడియా మొత్తం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో రెచ్చిపోతున్నారంటూ కథనాలు కూడా వెలువరుస్తోంది.
అయితే ఈ క్రమంలోనే తాలిబన్లు మరో దారుణానికి పాల్పడ్డారంటూ వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. అదేంటంటే దహార్‌లో ఓ వ్యక్తిని తాలిబన్లు దారుణంగా చంపి ఆ తర్వాత అమెరికా గస్తీ హెలికాప్టరుకు వేలాడదీసి మరీ ఆకాశంలో ఉరితీస్తూ వేలాడదీస్తూ తిప్పిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇంకేముంది ఆ వీడియో మీద అమెరికా రాజకీయ వేత్తల నుంచి ప్రపంచ ప్రముఖుల దాకా ఇటు భారత జర్నలిస్టులు కూడా దుమ్మెత్తి పోశారు. ఇదొక దారుణమైన అఘాయిత్యంగా పేర్కొంటూ తీవ్రంగా మీడియాలో కథనాలు ప్రసారం చేశారు.
ఇక్కడే అందరూ మిస్టేక్ అయ్యారని తెలుస్తోంది. ఎందుకంటే నిజానికి అది తప్పుడు వార్త అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో దాదాపుగా మిలియన్ల మంది షేర్ చేసిన ఈ వీడియో అరాచకానికి సంబంధించింది కాదని నిర్ధారణ అయ్యింది. దాదాపుగా పన్నెండు సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో తాలిబన్ల దాష్టీకం కాదని, అమెరికా పాట్రోలింగ్ హెలికాఫ్టర్ ను తాలిబన్లు తమ సంబురాల కోసం ఇలా ఉపయోగించారని సమాచారం. తాలిబన్లు ఆ వ్యక్తిని తమ విజయకేతంగా అలా ఊరేగించారు తప్ప చంపింది కాదని తెలుస్తోంది. ఇప్పుడు ఇది కాస్తా ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.
A viral video claiming to show a man being brutally hanged from a helicopter in Kandahar was likely an attempt to fix a flag over a public building, not a hanging. A separate video of the incident shows the man is clearly alive and waving in the air. pic.twitter.com/x6T5iDhpc9
— Shayan Sardarizadeh (@Shayan86) August 31, 2021