విశాఖలో గ్యాస్ లీకేజి కలకలం… ఉలిక్కి పడ్డ జనాలు

-

విశాఖ పట్నంలో మరోసారి గ్యాస్‌ లీకేజ్‌ కలకలం రేగింది. విశాఖ లోని హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కు చెందిన చమురు శుద్ది కర్మాగారంలో గ్యాస్‌ లీక్‌ అయింది. గ్యాస్‌ లీక్‌ అయిన వెంటనే రిఫైనరీలో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. సైరన్‌ మోగడం తో కార్మికులు ప్లాంట్‌ నుంచి బయటకు పరుగులు తీశారు.

గ్యాస్‌ లీకేజిని గుర్తించిన అధికారులు.. తక్షణమే చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన లో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని హెచ్‌పీసీఎల్‌ అధికారులు స్పష్టం చేశారు. చమురు శుద్ధి పనులు మళ్లీ తిరిగి కొనసాగుతున్నట్లు వెల్లడించారు అధికారులు. కాగా… 2020 మే 7న ఎల్జీ పాలిమర్స్‌ లో గ్యాస్‌ లీక్‌ అయి…. 15 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. వెంకటాపురం, పరిసర ప్రాంతాల ప్రజలు విష వాయువు ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇక తాజాగా మరో సారి విశాఖ లో గ్యాస్‌ లీక్‌ కావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version