ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వల్ల కొవిడ్ నుంచి కోలుకుంటున్నారు. ఇది మనమందరం కళ్లారా చూస్తూనే ఉన్నాం. టీకా తీసుకున్నవారు, మిగతా వారికి కంటే బెటర్‌గా ఉన్నారు. కానీ, తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారం జరుగుతోంది. అదే వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి, కరోనా బారిన పడిన వ్యక్తి కాలేయం మధ్య తేడాలను 3డీ సీటీ స్కాన్ తీసిన రెండు ఇమేజ్‌లు వైరల్ అవుతున్నాయి. అయితే, ఆ వార్తేంటో, ఫ్యాక్ట్ చెక్ ఎంటో తెలుసుకుందాం.
ఆ ఫోటోలో కుడివైపున కరోనా బారిన పడిన వ్యక్తి కాలేయం తీవ్రంగా ఇన్ఫెక్షన్‌కు గురైనట్లు, ఎడమవైపు ఇమేజ్‌లో టీకా తీసుకున్న వ్యక్తి కాలేయం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు తీసిన సీటీ స్కాన్. దీనిపై ఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్ ఇనాక్యూలేషన్ సెంటర్ యజమాని, డాక్టర్ సుమీత్ దూబే ట్వీట్టర్‌లో స్పందించారు. దీని వల్ల ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ సెక్రటరీ జనరల్ ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, రేణుక జైన్ తదితరులు కూడా ఈ ఫోటోపై స్పందించారు.
ఇంటర్నేష్‌నల్ బిజినెస్ టైమ్స్ కూడా ఈ ఫోటోపై సానుకూలంగా స్పందించిన పోస్టులను పెట్టింది. అదేవిధంగా ఈ పిక్ తప్పుదోవ పట్టించింది. ఈ పిక్ 2020లో కెనడియన్ న్యూస్ అల్ట్ న్యూస్ పబ్లిష్ చేసింది. ‘కొవిడ్ పేషంట్లకు మంచి చికిత్స అందించడానికి సీటీ స్కాన్ లక్ష్యమని’ టైటిల్‌తో పబ్లిష్ అయింది. కానీ, ఫిబ్రవరిలో వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ విన్ గుప్తా ఆ ఇమేజ్‌పై స్పందిస్తూ.. ఎడమవైపున ఉన్న లంగ్స్ సాధరణ వ్యక్తివి, కుడిపైపు ఉన్న వ్యక్తి కొవిడ్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవి అని ట్వీట్ చేశాడు. ఫ్యాక్ట్ చెక్ ఏంటంటే.. ఇందులో కేవలం ఒక్క ఇమేజ్ మాత్రమే కొవిడ్ బారిన పడిన వ్యక్తివి. రెండోది కాదు. ఇమేజ్‌తో తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నా, వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ ఇమేజ్ చూసి ముందుకు వస్తారు.