శాకాహారం గురించి తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే..!

-

శాఖాహారులు శాఖాహారం మాత్రమే తీసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి చాలా మంది శాకాహారానికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్ లేని విషయాలుని చెప్తూ ఉంటారు నిజానికి ఇక్కడ ఉండేవి కేవలం అపోహ మాత్రమే. నిజాలు గురించి ఇప్పుడు చూద్దాం. శాఖాహారం తీసుకొనే వారు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి లేకపోతే అనవసరంగా అపోహలు నిజమని నమ్మాల్సి వస్తోంది.

చాలామంది అంటూ ఉంటారు శాఖాహారం మాత్రమే తింటే ప్రోటీన్ అందదని.. ప్రోటీన్ లోపం వస్తుంది అని చెప్తూ ఉంటారు అయితే నిజానికి 50 కిలోల వ్యక్తికి 40 గ్రాముల ప్రోటీన్ సరిపోతుంది. శాకాహారంలో కూడా ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయి. ఉదాహరణకు శెనగలు, బఠానీలు, తృణధాన్యాలు, టోఫు వంటి వాటిలో ఉంటాయి. సోయా, గింజలు వంటి వాటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి శాకాహారులు శాకాహారం ద్వారా కూడా ప్రోటీన్ ని పొందొచ్చు మాంసాహారం తినాల్సిన పని లేదు.
అలానే శాకాహారులకు మరొక సందేహం ఉంటుంది అదేంటంటే పండ్లలో చక్కెర ఉంటుంది కదా అలాంటప్పుడు పండ్లను తినొచ్చా లేదా అనేది. మామూలుగా షుగర్ లో ఉండే పదార్థం వేరు అలానే పండ్లలో ఉండే పదార్థం వేరు కాబట్టి ఈ విషయంలో భయపడక్కర్లేదు.
శాకాహారం తినే వాళ్ళు శాకాహారం తినీ తినీ విసుగుచెంది పోయారని అంటూ ఉంటారు అలాంటప్పుడు మాంసాహారం తీసుకోవాలా అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి శాఖాహారం అయినా మాంసాహారం అయినా రోజు తింటే బోర్ కొడుతుంది అటువంటపుడు వంటలో మార్పులు చేసుకోవాలి అప్పుడు తిన్నా విసుకురాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version