వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ల్ వర్మ ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ తో లంచ్ సమావేశం జరిపినన వర్మ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే జగన్ అని కలిసిన మరుసటిరోజే ( నేడు) ఆయన ఓ రాజకీయ చిత్రాన్ని ప్రకటించారు. దీంతో ఆయన ప్రకటించిన ఈ కొత్త చిత్రంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ” వ్యూహం” అనే రాజకీయ సినిమాలు త్వరలో తీయనున్నట్లు ప్రకటించారు వర్మ.
ఈ విషయాన్ని అయన ట్వీట్ చేస్తూ.. ” ఇది బయోపిక్ కాదు. అంతకంటే లోతైన రియల్ పిక్. బయోపిక్ లోనైనా అబద్ధాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్ లో నూటికి నూరుపాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన ” వ్యూహం” కదా రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచకురువు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతీకాష్టే ఈ చిత్రం”. అని ట్వీట్ చేశారు.