మహారాష్ట్రంలో సీఎం ఎంపిక ప్రకియ మొత్తానికి తుది దశకు చేరుకుంది. రాష్ట్రానికి కాబోయే తదుపరి ముఖ్యమంత్రిని శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే నేడు సాయంత్రం 5.30 గంటలకు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఎస్సీపీ చీఫ్ అజిత్ పవార్, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేయనున్నారు.
ఈ క్రమంలోనే గురువారం దేవేంద్రే ఫడ్నవీస్ ముంబైలోని శ్రీ సిద్ధవినాయక మందిరానికి వెళ్లారు. బాధ్యతల స్వీకరణకు ముందు విఘ్నాధిపతి ఆశ్వీరాదాలు తీసుకున్నారు. కాగా, సీఎం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి పీఎం మోడీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు హాజరు కానున్నారు.