భార్యతో గొడవ.. బాంబు ఉందంటూ పోలీసులకు కాల్‌

-

భర్త తీరుతో విసిగిపోయి ఇద్దరు పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి కాపురానికి రప్పించేందుకు ఆ వ్యక్తి రకరకాలుగా ట్రై చేశాడు. అయినా ఆమె రాకపోవడంతో పోలీసుల సాయం కోరాడు. ఫలితం కనిపించకపోవడంతో పోలీసులపై కోపం పెంచుకున్నాడు. చివరకు ఏం చేశాడంటే..?

చాంద్రాయణగుట్ట రియాసత్‌నగర్‌ డివిజన్‌ రాజనర్సింహనగర్‌కు చెందిన మహమ్మద్‌ అక్బర్‌ఖాన్‌ జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. దంపతుల మధ్య వాగ్వాదాలు జరిగేవి. ఇటీవల  పిల్లలను తీసుకుని భార్య చౌటుప్పల్‌లో ఉంటున్న తల్లి ఇంటికి వెళ్లిపోయింది. కాపురానికి పంపాలని పలుమార్లు కోరినా ఫలితం లేక చౌటుప్పల్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.

మంగళవారం రాత్రి ఐఎస్‌సదన్‌ కూడలిలో మందిర్‌-మసీదు వద్ద బాంబు ఉందని డయల్‌ 100కు సమాచారం ఇచ్చాడు.  బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు వచ్చి అర్ధరాత్రి గాలించినా ఎలాంటి ఆనవాళ్లూ కనిపించలేదు. కాల్‌ ట్రాక్‌ ద్వారా ఫోన్‌ చేసిన వ్యక్తి ఆచూకీ తెలుసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నాంపల్లి ఏడో స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపర్చగా 18 రోజుల పాటు జైలుశిక్షను విధిస్తూ న్యాయమూర్తి లక్ష్మణ్‌రావు తీర్పు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version