మీకు అర్ధమవుతుందా నేరం నాది కాదు : ఇట్లు మీ గబ్బిలం ! 

-

తినే విషయంలో పట్టింపులు ఉండవు, వండుకునే విషయంలో వెనకడుగు ఉండదు, పులుసు పెట్టుకుని పులకించిపోతారు, ఇగురుపెట్టుకుని ఇరగబడి మరీ తింటారు కానీ… ఏదైనా సమస్య వస్తే మాత్రం ఆ నేరం ఏ జంతువుపై వేద్దామా, ఏ పక్షిపై వేద్దామా, ఏ సరీశృపాలపై వేద్దామా, ఏ కీటకంపై వేద్దామా అని ఈ నోరు లేని మూగ జీవాలపై ఎందుకు పడతారో ఈ మనుషులు అంటూ తెగ ఫీలయిపోతున్నాయి  గబ్బిలాలు. చైనాలో మాంసాహార విపణి ఉందని అనండి ఒప్పుకుంటాం..

కరోనా వైరస్ వూహాన్ లోనే పుట్టిందని అనండి అంగీకరిస్తాం.. కానీ అది మా వల్లే వచ్చిందంటే మాత్రం భరించలేము అంటున్నాయంట గబ్బిలాలు!! వీటి  బాదలో నిజముందని తేల్చేసింది భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)! అవును… ఇంతకాలం ఇది చైనా పుట్టించిన వైరస్ కాదని, ఇది తాము కావాలని చేసింది కాదని తెగ డైలాగులు చెప్పిన చైనా… ఇది కేవలం గబ్బిలాల వల్ల వచ్చింది అని కాకమ్మ కబుర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది అనే విమర్శలు పుష్కలంగా వస్తున్న తరుణంలో తాజాగా ఒక క్లారిటీ ఇచ్చింది భారతీయ వైద్య పరిశోధన మండలి. గబ్బిలాల నుంచి మనుషులకు కరోనా వైరస్ సోకడమనేది చాలా అరుదైన విషయమని, అది ఏ వెయ్యేళ్లకొకసారో జరిగితే జరగొచ్చని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజాగా స్పష్టం చేసింది.

ఈ విషయాలపై మరింత క్లారిటీ ఇచ్చిన ఐసీఎంఆర్.. భారత్ లో ఇటీవల చేసిన పరిశోధనల్లో రెండు రకాల గబ్బిలాల్లో కరోనా జాడలు కనుగొన్నారని, అయితే అవి మనుషులకు వ్యాపించేంతటి శక్తిమంతంగా లేవని తేలిందని ఐసీఎంఆర్ ప్రధాన శాస్త్రవేత్త
రామన్ గంగాఖేడ్కర్ వివరించారు. తో గబ్బిలాలకు దైర్యం వచ్చేసి.. ఈ పనికిమాలిన పనికి మేము కారణం కాదు అని గంటాపథంగా చెబుతున్నాయట! ఇంతవరకూ గబ్బిలాలు సేఫ్ అనుకుందాం ఉంది కానీ… మరి దీనికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తనదైన శైలిలో చెబుతుంది అమెరికా! ఆ వైరస్ చైనాలోని వుహాన్ లో పురుడు పోసుకుందని.. కావాలనే ఈ విషయాలను చైనా దాచిపెట్టి ఈ రోజు ప్రపంచాన్ని వణికించాలని అనుకుంటుందని.. నిజంగా వారికి ఇలాంటి వంకరబుద్ది లేని పక్షంలో, కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పుడే తమ వైద్య బృందానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని మొదలుపెట్టింది అమెరికా! ఇది పూర్తిగా వక్రబుద్దితో చైనా చేసిన తప్పుడు పనే అనేది పూర్తిగా అమెరికా నమ్ముతున్న విషయంగానే ఉందనేది పలువురి వాదన! ఇదే క్రమంలో చైనాలో ఇప్పటివరకూ నమోదైన కేసులు, మరణాల వివరాలు కూడా చైనా తప్పుడు సమాచారాన్నే
ప్రపంచానికి ఇస్తుందనేది అమెరికా వైపునుంచి వస్తున్న మరో విమర్శ!

ఇదే అభిప్రాయాన్ని అమెరికాతోపాటు చాలా ప్రపంచదేశాలు అధికారికంగానూ, అనధికారికంగానూ భావిస్తున్నాయ్యనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… నిజం నిలకడమీద తెలుస్తుంది కానీ.. ప్రస్తుతానికి మాపై మాత్రం పడొద్దు, మాపై నీలాపనిందలు వెయ్యొద్దు అని మొత్తుకుంటున్నాయి గబ్బిలాలు!… మీకు అర్ధమయ్యిందా!!

Read more RELATED
Recommended to you

Exit mobile version