ఆస్ట్రేలియా పర్యటనలో టీం ఇండియా క్వారంటైన్…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో క్రికెట్ ని ఇప్పటిలో నిర్వహించే అవకాశం కనపడటం లేదు. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివర్లో మన దేశం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. ఈ నేపధ్యంలో అక్కడ మన జట్టుని పూర్తిగా క్వారంటైన్ చేసిన తర్వాతే మ్యాచ్ లు ఆడించాలి అని ఆ దేశం నిర్ణయం తీసుకుంది.

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌లోని ఒక నివేదిక ప్రకారం ప్రస్తుత అక్కడ కరోనా కట్టడి చర్యల ఆధారంగా చూస్తే… సందర్శకులు 14 రోజులు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. క్రీడాకారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అడిలైడ్ ఓవల్ లో 138 గదుల భారీ హోటల్ ని మన వాళ్లకు కేటాయిస్తారు. అక్కడ నెట్స్ లో శిక్ష కూడా ఏర్పాటు చేస్తారు. ఇక పోషకాహారం కూడా అందిస్తారు.

వేదిక వద్ద సన్నాహక మ్యాచ్ కూడా నిర్వహిస్తారు. తప్పని సరిగా రెండు వారాలపాటు ఆటగాళ్ళు క్వారంటైన్ లో ఉండాల్సిందే అని ఆ దేశం పేర్కొంది. దీనిపై మన ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారులు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సంతకం చెయ్యాల్సి ఉంటుంది. నాలుగు టెస్టుల సిరీస్‌కు ముందు, ఆస్ట్రేలియా కూడా అక్టోబర్-నవంబర్‌లో టి 20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version