గర్భిణీని వీపుపై మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు

-

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అంబులెన్స్ వెళ్లడానికి దారి లేక గర్భిణిని కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లారు. ఈ తరుణంలోనే మార్గ మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సంగారెడ్డి జిల్లా నాగిల్ గిద్ద మండలం మున్యా నాయక్ తండలోకి అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక ఆశా వర్కర్ల సహాయంతో గర్భిణీ స్త్రీని 2 కిలోమీటర్ల వరకు భుజాలపై మోసుకెళ్లారు కుటుంబ సభ్యులు.

pregenant
Family members carrying pregnant woman on their backs

అయితే మార్గమధ్యలోనే ఆడబిడ్డకు జన్మనివ్వగా, అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు, ఆశా వర్కర్లు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని ఎన్ని సార్లు డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మున్యా నాయక్ తండా వాస్తవ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news