గువ్వలకు రామచంద్ర రావు బిగ్ షాక్.. 100 మంది కూడా జాయిన్ అయ్యాకే !

-

గువ్వల బాలరాజుకి బీజేపీ పెద్ద ఫిట్టింగ్ పెట్టిందని గులాబీ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. ప్రస్తుతం బాలరాజుకి తామిచ్చింది సాధారణ మెంబర్‌షిప్ మాత్రమే అని.. బీజేపీలో 100 మందిని చేర్చిన తర్వాతే యాక్టివ్ మెంబర్‌షిప్ ఇస్తామని..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వెల్లడించారు.

Guvvala Balaraju Joins In BJP Party
Guvvala Balaraju Joins In BJP Party

బాలరాజు వెంట నాయకులు, ఇతర కార్యకర్తలు ఎవరూ రాలేదని తేల్చేసారట. దింతో ముందు నొయ్యి, వెనుక గొయ్యిలా గువ్వల బాలరాజు పరిస్థితి మారిందని చర్చ జరుగుతోంది. అటు  BRS అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు..బీజేపీలో చేరిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడారు. బీజేపీకి తెలంగాణ గేట్ వే ఆఫ్ ఇండియాగా మారబోతోందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని గుర్తించి గువ్వల బాలరాజు పార్టీలో చేరారన్నారు రామచందర్ రావు.

 

Read more RELATED
Recommended to you

Latest news