ఆదివాసి బిడ్డలకు ఈ సంవత్సరం నుంచి ఉచితంగా విద్యను అందిస్తామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంట చక్రపాణి తెలిపారు. ఆదివాసులకు పిల్లలకు ఉచితంగా చదువును చేరువ చేయాలని ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. ఉచితంగా విద్యను అందిస్తాం. గోండు, కోయ, చెంచు తదితర తెగలవారికి ఫీజు లేకుండా కేవలం రూ. 500 తోనే అడ్మిషన్ పుస్తకాలను అందిస్తామని వెల్లడించారు.

మరిన్ని వివరాల కోసం… 040-23680333, 23680555 నంబర్లను సంప్రదించాలని చెప్పారు. ఇదిలా ఉండగా…. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 11వ తేదీ నుంచి నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లు, కాలేజీలలో ఈ మాత్రలను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. 1-19 సంవత్సరాల వయసున్న వారందరూ నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని వెల్లడించారు.