అఘోరీ నన్ను బలవంతంగా తీసుకెళ్లాడు: శ్రీవర్షిణి

-

అఘోరీ నన్ను బలవంతంగా తీసుకెళ్లాడని ప్లేట్ మార్చింది శ్రీవర్షిణి. గుజరాత్ పోలీసుల సహాయంతో అఘోరీ, శ్రీవర్షిణి అడ్రస్ ను ట్రేస్ చేశారు కుటుంబ సభ్యులు. అఘోరీ ఫోన్ నెంబర్ల ఆధారంగా గుజరాత్ లో ఉన్నట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులకు అప్పగించారు గుజరాత్ పోలీసులు. గుజరాత్ నుంచి గుంటూరు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీవర్షిణికి ఏం జరిగినా నన్ను అడగొద్దు అంటోంది అఘోరీ.

Family members traced the addresses of Aghori and Srivarshini with the help of Gujarat Police

ఇక అటు “అఘోరి.. నా బిడ్డను నాకిచ్చేయ్”…అంటూ శ్రీవర్షిణి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అఘోరీ వద్ద నుంచి తమ కూతురిని ఎలాగైనా అప్పగించాలని కోరారు తల్లి. శ్రీవర్షిణిని అఘోరి వశపరుచుకుని తమకు దూరం చేసిందని తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. ఇప్పటికే మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు శ్రీవర్షిణి తండ్రి కోటయ్య. తమను అఘోరి లైంగింకంగా వేధించినట్లు ఆరోపిస్తున్నారు శ్రీ వర్షిణి అన్నయ్య.

Read more RELATED
Recommended to you

Latest news