చిరంజీవి నటించిన భోళాశంకర్ మూవీ ఈ రోజు థియేటర్ లలో విడుదలయ్యి డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది, ఈ టాక్ తో థియేటర్ లలో రెండు మూడు రోజులు అయినా నిలవడం కష్టమేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండడం చాలా నిరాశపరిచి విషయమని చెప్పాలి. ముఖ్యంగా ఇది ఒక రీమేక్ సినిమా కావడం ఒక నెగటివ్ పాయింట్ అని చెప్పాలి… ఆల్రెడీ వచ్చిన సినిమాను మళ్ళీ రీమేక్ గా తీసి హిట్ తీయాలనుకోవడం కొంచెం ప్రయోగాత్మకం అని చెప్పాలి. ఇక మెగా హీరోలు అయితే వరుస పెట్టి రీమేక్ సినిమాలనే తీస్తున్నారు.. రామ్ చరణ్ దృవ తీయగా హిట్ అయింది.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో ఇలా మూడు సినిమాలు చేయగా అందులో రెండు యావరేజ్ మూవీ లు అయితే బ్రో పరిస్థితి మీకు తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ సినిమా తీశాడు.. ఇది భారీ ప్లాప్ గా నిలిచింది. తాజాగా భోళాశంకర్ కూడా రీమేక్ కావడం అది ప్లాప్ అవడం చకచకా జరిగిపోయాయి.
FANS REQUEST: చిరంజీవి సార్ … రీమేక్ మూవీస్ ఇక చేయకండి !
-