రాజస్థాన్ రాజకీయం: ముఖ్యమంత్రి మినహా.. మంత్రులందరూ రాజీనామా… రేపు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ

-

రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయంతో రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మినహా మంత్రులంతా రాజీనామా చేశారు. రేపు కొత్తగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరుగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరణ జరుగనుంది. ఇందు కోసం రేపు మధ్యాహ్నం పీసీసీ సమావేశం కూడా జరుగనుంది. రాజస్థాన్లో మంత్రుల నియామకం కోసం హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది. రేపు ఢిల్లీ లోని కాంగ్రెస్ అధిష్టానం నుంచి మంత్రుల పేర్ల జాబితాను పంపనుంది.

ప్రస్తుతం రాజస్థాన్ శాసన సభలో కాంగ్రెస్ పార్టీకి 200 మంది సభ్యుల సంఖ్య ప్రకారం కేబినెట్ లో గరిష్టంగా 30 మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. రాజస్థాన్‌ గవర్నర్‌ నివాసంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ విషయమై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌, ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడినట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version