బిగ్ షాక్ : జగన్ పైన వ్యతిరేకత .. అస్సలు ఊహించని పరిణామం ?

-

అమరావతి ప్రాంతంలో చంద్రబాబు హయాంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి తరుణంలో విశాఖపట్టణంలో ఒక రాజధానిని నిర్మించాలని అనుకుంటున్న జగన్ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది స్థానిక ప్రజల నుండి రైతుల నుండి రావడంతో వైసీపీ పార్టీలో ఇది ఊహించని పరిణామం గా మారింది. మేటర్ లోకి వెళ్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ పట్టణాన్ని పెట్టాలని భావిస్తున్న వైయస్ జగన్ సర్కార్ కి…విశాఖలో ల్యాండ్ పూలింగ్ చేద్దామనుకున్న అక్కడి నుండి సపోర్ట్ రావటం లేదట.

గ్రామాల్లో మరియు ఇతర చోట్ల ప్రభుత్వ అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సభలకు గ్రామస్థుల నుండి మరియు రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మా భూములు ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదని భూములు ఇచ్చిన తర్వాత కచ్చితంగా మమ్మల్ని ప్రభుత్వం మోసం చేస్తుందేమోనన్న ఆందోళనలో విశాఖ వాసులు ఉన్నరాట.

ఈ క్రమంలో గతంలో ఈ భూములను ప్రభుత్వమే పేదలకు ఇచ్చిందని ఎలాగైనా తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని మరోపక్క వాదన ప్రభుత్వం తీసుకు వస్తున్న నేపథ్యంలో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవేళ భూములు తీసుకోవాలనుకుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చి మొత్తం భూముల్ని తీసుకోమంటున్నారు. అలా ఇవ్వాలంటే… ఎకరానికి రెండు నుంచి మూడు కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో జగన్ సర్కార్ విశాఖలో ల్యాండ్ పూలింగ్ విషయంలో ఏం చేయలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version