తెలంగాణలో యూరియా కొరత వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రాల్లో యూరియా స్టాక్ లేదని నిర్వాహకులు చెబుతున్నట్లు సమాచారం.దీంతో కొన్ని కేంద్రాల వద్ద అన్నదాతలు గంటల తరబడి ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని సెంటర్లలో సరిపడా యూరియా ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే యూరియా బస్తాల కోసం రైతులు ఎగబడ్డారు.తెల్లవారుజాము నుంచే లైన్లలో నిలబడిన రైతుల తీవ్ర అవస్థలు పడినట్లు సమాచారం. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర శుక్రవారం ఉదయం వెలుగుచూసింది.యూరియా బస్తాల కొరత ఉండడంతో ఒకేసారి రైతులు ఎగబడటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. లోడు వచ్చిన గంట సేపటికే యూరియా బస్తాలు అయిపోవడంతో యూరియా సరిపడ్డంతా ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు.